Narendra Modi: ఇక్రిశాట్ శాస్త్రవేత్తలకు అభినందనలు
Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెంచటంలో ఇక్రిశాట్‌ది కీలక పాత్ర
Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెంచటంలో ఇక్రిశాట్‌ది కీలక పాత్ర
Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో విస్తీర్ణం పెంచటంలో ఇక్రిశాట్‌ది కీలక పాత్ర అని అన్నారు ప్రధాని మోడీ. ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఇక్రిశాట్ కొత్త లోగోతో పాటు స్టాంప్‌ను ఆవిష్కరించారు. వసంతపంచమి రోజు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. 50ఏళ్లు చాలా పెద్ద మైలురాయని, శాస్త్రవేత్తలకు, ఈ ప్రయాణంలో భాగమైన అందిరికీ అభినందనలు తెలిపారు మోడీ.
బడ్జెట్‌లో సేంద్రీయ సాగుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చామన్న మోడీ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే కొత్త వంగడాలు సృష్టించాలన్నారు. వాతావరణ మార్పులు పెను సవాళ్లుగా మారుతున్నాయని, వాటిని అధిగమించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలో 80 శాతం మంది సన్నకారు రైతులు ఉన్నారని, దేశంలో 170 కరువు జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇక నదుల అనుసంధానంతో నీటి వనరులను పెంచుతామన్నా మోడీ తెలుగు రాష్ట్రాల రైతులకు ఈ మిషన్ ఉపయోగకరమని చెప్పారు.