Bandi Sanjay: ఫోన్‌ ట్యాపింగ్‌ మొదటి బాధితుడిని నేనే

Bandi Sanjay: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఈరోజు కాసేపట్లో సిట్‌ విచారణకు హాజరుకానున్నారు.

Update: 2025-08-08 06:06 GMT

Bandi Sanjay: ఫోన్‌ ట్యాపింగ్‌ మొదటి బాధితుడిని నేనే

Bandi Sanjay: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఈరోజు కాసేపట్లో సిట్‌ విచారణకు హాజరుకానున్నారు. విచారణకు ముందుగా మీడియాతో మాట్లాడిన ఆయన, తన వద్ద ఉన్న అన్ని రకాల రికార్డులు, ఆధారాలను సిట్‌ అధికారులకు అందజేస్తానని తెలిపారు.

"కేంద్ర మంత్రిగా, బాధ్యత గల పౌరుడిగా నాకున్న ఆధారాలను సమర్పిస్తాను. తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ విషయాన్ని మొదట బయటపెట్టింది నేనే. గత వారమే సిట్‌ నోటీసులు ఇచ్చింది. అయితే పార్లమెంట్‌ సమావేశాల కారణంగా అప్పట్లో విచారణకు రాలేకపోయాను. ఈ కేసులో నేను రాష్ట్రంలో మొదటి బాధితుడిని," అని బండి సంజయ్‌ అన్నారు.

అలాగే, కాంగ్రెస్‌ ప్రభుత్వం మరియు సిట్‌ అధికారులపై తనకు నమ్మకం లేదని, రాష్ట్ర ప్రభుత్వం సిట్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబంలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని వ్యాఖ్యానించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగిస్తే, అన్ని విషయాలను బహిర్గతం చేస్తానని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News