Palvai Sravanthi: దమ్ముంటే భాగ్యలక్ష్మీ ఆలయంలో ఈటల ప్రమాణం చేయాలి
Palvai Sravanthi: 25 కోట్లు ఎవరికి ఇచ్చారో ఈటల చెప్పాలి
Palvai Sravanthi: దమ్ముంటే భాగ్యలక్ష్మీ ఆలయంలో ఈటల ప్రమాణం చేయాలి
Palvai Sravanthi: ఈటల రాజేందర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి అన్నారు. ఈటల ఆరోపణలను ఖండిస్తున్నట్టుగా చెప్పారు. తమకు డబ్బులు వచ్చాయని ఈటల అంటున్నారని.. అయితే ఎవరికిచ్చారని ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే ఆయన నిరూపించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలని అన్నారు. బీఆర్ఎస్‌లో ఈటల రాజేందర్ ఉన్నప్పుడు ఇలాంటి డీల్స్ ఫిక్స్ చేశారా? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు అయిపోయిన ఆరు నెలలకు ఇప్పుడేందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.