Palla Rajeshwar Reddy: కేసీఆర్ దృష్టిలో రాజయ్య ఉన్నారు.. రెండ్రోజుల్లో సీఎం కేసీఆర్‌ను కలుస్తాం..!

Palla Rajeshwar Reddy: సీఎం కేసీఆర్ దృష్టిలో రాజయ్య ఉన్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తెలిపారు.

Update: 2023-08-23 13:12 GMT

Palla Rajeshwar Reddy: కేసీఆర్ దృష్టిలో రాజయ్య ఉన్నారు.. రెండ్రోజుల్లో సీఎం కేసీఆర్‌ను కలుస్తాం..!

Palla Rajeshwar Reddy: సీఎం కేసీఆర్ దృష్టిలో రాజయ్య ఉన్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తెలిపారు. మొదటి నుంచి రాజయ్య ఉద్యమంలో పని చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం 2012లో ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని చెప్పారు. కొన్ని సర్వేల ప్రకారం కడియంకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. రెండు, మూడు రోజుల్లో సీఎం కేసీఆర్‌తో కడియం శ్రీహరి, రాజయ్య భేటీ ఉంటుందన్నారు. రాజయ్య, కడియం శ్రీహరి కలిసి స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తారన్నారు.

Tags:    

Similar News