Revanth Reddy: నూతన పరిశ్రమలకు పాలమూరు వేదిక కాబోతుంది

Revanth Reddy: నూతన పరిశ్రమలకు పాలమూరు జిల్లా వేదిక కాబోతుందని సీఎం రేవంత్ అన్నారు.

Update: 2025-09-03 10:41 GMT

Revanth Reddy: నూతన పరిశ్రమలకు పాలమూరు వేదిక కాబోతుంది

Revanth Reddy: నూతన పరిశ్రమలకు పాలమూరు జిల్లా వేదిక కాబోతుందని సీఎం రేవంత్ అన్నారు. గతంలో విద్య, సాగునీరు లేకపోవడంతో జిల్లా ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లేవారన్నారు. గతంలో కేసీఆర్‌ను గెలిపించినా జిల్లా అభివృద్ధి జరగలేదని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌కు ట్రిపుల్ ఐటీ కాలేజీని మంజూరు చేశామన్నారు.

నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌ను కేటాయించమన్నారు. గ్రీన్ ఛానెల్ ద్వారా పాలమూరు సాగునీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చామని అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఎస్‌జీడీ ఫార్మా రెండో యూనిట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

Tags:    

Similar News