Ponnam Prabhakar: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాకు సోదర సమానులు

Ponnam Prabhakar: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి స్పందించారు.

Update: 2025-10-08 06:06 GMT

Ponnam Prabhakar: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి స్పందించారు. తమ మధ్య 30 ఏళ్ల స్నేహ బంధం ఉందని.. అది రాజకీయాలకు మించినదేనన్నారు. అడ్లూరి లక్ష్మణ్ తనకు సోదరుల వంటివారని.. తమ మధ్య ఉన్న అనుబంధం పరస్పర గౌరవం ఎప్పటిలాగే కొనసాగుతుందన్నారు. దీన్ని ఎవరూ విడదీయలేరన్నారు.

ఆయనపై తాను ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ‌్యలు చేయలేదన్నారు. రాజకీయ దురుద్దేశంతో కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారన్నారు. ‎ఈ అపార్ధాల వల్ల అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మనసు నొచ్చుకుందని తెలిసి విచారిస్తున్నట్టు పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Tags:    

Similar News