Hyderabad Rains: హైదరాబాద్‌కు ఆరెంజ్ ఆలర్ట్ జారీ.. మరో 24గంటల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్
Hyderabad Rains: ప్రమాదస్థాయిని దాటిన హుస్సేన్‌సాగర్ నీటిమట్టం
Hyderabad Rains: హైదరాబాద్‌కు ఆరెంజ్ ఆలర్ట్ జారీ.. మరో 24గంటల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్
Hyderabad Rains: హైదరాబాద్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రస్తుతం నగరంలో వర్షం ఆగిపోయినా.. ఇవాళ సాయంత్రానికి మళ్లీ వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వరద కారణంగా హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారిపోయింది. దీంతో నీటిని కిందకు వదలుతున్నారు. భారీ వరదతో మూసీ నది పరవళ్లు తొక్కుతోంది.