సెప్టెంబర్‌ 1 నుంచి సీనియర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభం

Update: 2020-08-16 05:03 GMT
Representational Image

AICTE Online Classes : వచ్చే నెల ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల్లో తరగతులు ప్రారంభమయ్యేలా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) షెడ్యూల్‌ను సవరించింది. ఈ మేరకు సీనియర్‌ విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన సెప్టెంబర్‌ 1 నుంచి మొదలుకానుండగా నవంబర్‌ 1 నుంచి ఫస్టియర్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవనున్నాయి. మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ, పాఠ్యాంశ బోధనతో పాటు కళాశాలల గుర్తింపు ఇతర కార్యకలాపాలపైన స్పష్టమైన తేదీలను కూడా ఏఐసీటీఈ సూచించింది. ఆఫ్‌లైన్‌ పద్ధతి లేదా ఆన్‌లైన్‌ పద్దతి ద్వారా నిర్దేశించిన విధంగా సీనియర్‌ విద్యార్థులకు ముందుగా బోధన మొదలు పెట్టాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. నవంబర్‌ ఒకటో తేదీ నాటికి సాంకేతిక, వృత్తి విద్య యూజీ, పీజీ కోర్సు ల్లో ఫస్టియర్‌ అడ్మిషన్ల ప్రక్రియ రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచనలు చేస్తే ప్రస్తుతం క్యాలెండర్‌ లో మార్పులను చేసే అవకాశముంటుందని తెలిపింది. ఈమేరకు తాజాగా సవరించిన అకడమిక్‌ క్యాలెండర్‌ 2020–21ను విడుదల చేసింది.

ఇక అకడమిక్‌ క్యాలెండర్‌లో చేసిన సవరణల వివరాల్లోకెళితే 15వ తేదీ నాటికి కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులు చేరాలని, వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు తమ సీట్లను రద్దు చేసుకోవాలనుకుంటే నవంబర్‌ 10లోగా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పూర్తి కానందున వారిని మినహాయించి మిగతా తరగతుల విద్యార్థులకు బోధన ప్రారంభించాలి. సెప్టెంబర్‌ 1 నుంచి సీనియర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలి. నవంబర్‌ ఒకటో తేదీ నాటికి రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తి చేసి విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. అదే రోజు నుంచి ఫ్రెషర్స్‌కు తరగతులు ప్రారంభమవుతాయి. వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సెట్‌లను త్వరితంగా నిర్వహించి అక్టోబర్‌ 20వ తేదీ నాటికి తొలి విడత అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్‌ ఒకటో తేదీ నాటికి సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలి.




Tags:    

Similar News