హస్నాపూర్‌‌లో రెడ్ అలర్ట్.. పోలీసుల పహారా

Update: 2020-04-04 17:08 GMT

తెలంగాణలో గంటగంటకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్‌లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇటీవల నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఓ యువకుడికి టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ యువకుడికి హైదరాబాద్ తరలించి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అధికారులు హస్నాపూర్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆ గ్రామం చుట్టూ భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇళ్లలో నుంచి ఎవరూ బయటికి రాకుండా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఆశా వర్కర్లు గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ఇక నిత్యావసర సరుకులను గ్రామస్తులకు సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అవసరం లేకుండా ఇళ్లలో నుంచి బయటకు వచ్చేవారిపై పోలీసులు దృష్టి సారించారు. మరోసారి బాటకు వస్తె కేసులు నమోదు చేస్తున్నారు. గ్రామంలో ఇంకా ఎవరైనా మర్కజ్‌కు వెళ్లి వచ్చారా..?, కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడితో ఎవరెవరు సన్నిహితంగా తిరిగారనే కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 229 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి 11 మంది మరణించారు.



Tags:    

Similar News