Osmania Hospital Nurses Protest: ఉస్మానియాలో 3వ రోజు కొన‌సాగుతున్న న‌ర్సుల ధ‌ర్నా

Update: 2020-07-29 13:20 GMT
ఉస్మానియా ఆస్పత్రి

Osmania Hospital Nurses Protest : కరోనా వైరస్ వ్యాప్తిలో పనిచేయడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కొందరైతే ఏకంగా సెలవులు పెట్టి ఇంటి దారి పడుతున్నారు. మరికొంత మంది ఇంటి ముఖం చూడకుండా రోజులు తరబడి ఆస్పత్రిలోనే ఉండి రోగులకు సేవలందింస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరికొంతమంది వ్యాధి బారిన పడిన సందర్భాలున్నాయి. అయితే కరోనా ఆపత్కాలంలో బాధితులకు ఎంతగానో సేవ చేసి వారి ప్రాణాలను కాపాడుతున్న ఓట్ సోర్సింగ్ నర్సులకు ప్రభుత్వం వేతనాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో వారు ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో వారి జీతాలు వారికి ఇవ్వాలని ఉస్మానియా ఆసుపత్రిలో న‌ర్సులు చేప‌ట్టి ద‌ర్నా మూడో రోజుకు చేరుకుంది. నాలుగు నెల‌లుగా తమ జీతాలు తమకు ఇవ్వ‌డం లేదంటూ 87 మంది స్టాఫ్ న‌ర్సులు విధులు బ‌హిష్క‌రించారు.

వీరు ధర్నాచేయడంతో 12 ముఖ్య విభాగాల్లో గ‌త మూడు రోజులుగా సేవ‌లు కుంటుప‌డ్డాయి. కరోనా నేపథ్యంలో భాధితులకు సేవలు అందించడానికి గాను ప్రభుత్వం ప్రస్తుతం కొంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నాలుగు నెలల క్రితమే విధుల్లోకి తీసుకున్నారు. నాలుగు నెల‌ల క్రిత‌మే ఉద్యోగంలో చేరినా అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్ప‌టివ‌ర‌కు వారికి ఎలాంటి అపాయింట్మెంట్ లెట‌ర్ ఇవ్వ‌డం లేద‌ని ఉద్యోగులు ఆందోళ‌న చేపట్టారు. ఓపీ, ఎమర్జెన్సీ, ఐసోలేషన్ వార్డులు, పోస్టు ఆపరేటివ్ వార్డుల్లో రోగులు తీద్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. న‌ర్సుల ఆందోళ‌న‌ల‌తో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త‌క్ష‌ణ‌మే అవుట్‌సోర్సింగ్ లెట‌ర్‌తో పాటు, ఐడీ కార్డు, రెండు నెల‌ల జీతం ఇస్తేనే విదులకు హాజ‌ర‌వుతామ‌ని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News