Numaish Exhibition: ఇవాళ్టితో ముగియనున్న నుమాయిష్ ఎగ్జిబిషన్

Numaish Exhibition: 45 రోజుల పాటు సాగిన నుమాయిష్ ఎగ్జిబిషన్

Update: 2023-02-14 02:11 GMT

Numaish Exhibition: ఇవాళ్టితో ముగియనున్న నుమాయిష్ ఎగ్జిబిషన్

Numaish Exhibition: హైదరాబాద్ వాసుల్ని ఆకట్టుకున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇవాళ్టితో ముగియబోతోంది. ప్రతియేటా 45 రోజులపాటు సాగే ఎగ్జిబిషన్ ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశేష ప్రజాధరణ పొందిన నుమాయిష్ హైదరాబాద్ నుమాయిష్ ఎగ్జిబిషన్లో 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో ఎగ్జిబిషన్ నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. ఈ సారి అంచనాలకు మించి విజయవంతంగా సాగిందని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ ఎగ్జిబిషన్ లో అన్నీ వస్తువులు ఒక్కే చోట దొరకడంతో పాటు, వివిధ ప్రాంతాలకు చెందిన వస్తువులు అందుబాటులో ఉండటంతో నుమాయిష్ కి మరింత ఆదరణ పెరిగింది. ధరలు కూడా చౌకగా ఉండటంతో రాష్ట్ర నలు మూలల నుంచి వచ్చి కొనుగోలు చేశారు. వివిధ రకాల వెరైటీలు, డిజైన్లతో పాటు పలు ప్రాంతాలకు సంబంధించిన కళాకృతులు, స్పెషల్ ఐటమ్స్ సందర్శకులని ఎంతో గానో ఆకర్షించాయి. నుమాయిష్ లో ప్రత్యేకంగా కాశ్మిర్ ప్రోడక్ట్స్ నిలిచాయి ఎగ్జిబిషన్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ కాశ్మిర్ ప్రోడక్ట్స్ పై ఆసక్తి కనబరచారు. సందర్శనకు వచ్చిన వినియోగదారులతో ఎగ్జిబిషన్ కళకళలాడింది. 

Tags:    

Similar News