నుమాయిష్ గడువు పొడగింపు : గవర్నర్ తమిళి సై

ప్రతి ఏడాది నిర్వహించినట్టుగానే ఈ ఏడాది కూడా నాంపల్లిలో నుమాయిష్ ను జనవరి 1వ తేదీన ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లి‌లో విజయవంతంగా సాగుతున్న 80వ నుమాయిష్

Update: 2020-02-14 07:29 GMT

ప్రతి ఏడాది నిర్వహించినట్టుగానే ఈ ఏడాది కూడా నాంపల్లిలో నుమాయిష్ ను జనవరి 1వ తేదీన ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లి‌లో విజయవంతంగా సాగుతున్న 80వ నుమాయిష్ - 2020 ఎగ్జిబిషన్‌ ఇప్పటికే 45 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో నుమాయిష్ ముగింపు కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఆమెతో పాటు నుమాయిష్ కమిటీ అధ్యక్షుడు సురేందర్, కార్యదర్శి ప్రభాశంకర్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ ను మరో మూడు రోజులపాటు పొడిగిస్తున్నామని తెలిపారు. దీంతో ఈ నెల 15తో ముగియనున్న ప్రదర్శన 18 వరకూ కొనసాగనుందని తెలిపారు. ఈ నుమాయిష్ ద్వారా వచ్చిన డబ్బును 18 కళాశాలల్లో ఉన్న నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యను అందించేందుకు ఖర్చు చేయడం మంచి కార్యక్రమమని తెలిపారు.

ఇకపోతే ఇప్పటి వరకూ నుమాయిష్ ప్రదర్శనను 16.23 లక్షల మంది సందర్శించారని నిర్వహకులు పేర్కొన్నారు. ఇందులో మొత్తం 1,090 స్టాళ్ళు ఏర్పాటు చేసారని స్పష్టం చేసారు. ఈ నుయాయిస్ నిర్వహించడానికి అన్ని రకాల భద్రతను ఏర్పాటు చేశామని వారన్నారు.

Tags:    

Similar News