కరోనా ఎఫెక్ట్ : కడచూపుకూరానీ కుటుంబ సభ్యులు.. అందరూ ఉన్న అనాథశవంలా..

తెలంగాణలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అన్ని రంగాలను ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుంది.

Update: 2020-03-28 04:47 GMT

తెలంగాణలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అన్ని రంగాలను ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. అందరూ ఉన్నా ఆమె అనాథ శవం అయ్యింది. పెద్దపల్లి జిల్లాలోని నంది మేడారంలో 56 ఏళ్ల రాజవ్వ గురువారం సాయంత్రం అనారోగ్య కారణంతో మరణించింది. ఈ విషయం తెలిసిన గ్రామ పెద్దలు ఆమె బంధువులకు, కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ ద్వారా సమాచారం చేరవేశారు. అయితే రాజవ్వ కుటుంబ సభ్యులు కరోనా లాక్‌‌డౌన్ ఉండటం వల్ల తాము రాలేమని చెప్పేశారు. కడ చూపు కోసం బంధువులు కూడా ఎవరూ రాలేదు. అంత్యక్రియలు ఎవరు జరిపించాలన్న సమస్య తలెత్తింది. గ్రామస్థులేమో ఇళ్లలోంచీ బయటకు రాకూడదని నిర్ణయించుకున్నారు. ఆమె పాడే మోసేందుకు ఎవరూ రాలేదు.

ఆమె అంత్యక్రియల్లో పాల్గొంటే సమూహంగా పోగైనట్లు అవుతుందనీ తద్వారా కరోనా వ్యాపించే ప్రమాదం ఉంది కాబట్టి అంత్యక్రియల్లో పాల్గొనకూడదని గ్రామస్తులు అనుకున్నారు. దీంతో పంచాయతీ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులూ కలిసి శుక్రవారం అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధమయ్యారు. మృతదేహాన్ని మున్సిపాలిటీ కార్మికులు రిక్షాలో స్మశనవాటికకు తరలించారు. అలా అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆమె అంత్యక్రియలు జరిపారు. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే తెలంగాణలో 59 కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ఇది ప్రపంచ దేశాలలో కబళిస్తుంది. ఈ నేపథ్యంలో లో ప్రధాని మోదీ 21 రోజులపాటు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News