తెలంగాణలో నైట్ కర్ఫ్యూ... క్లారిటీ ఇచ్చేసిన హెల్త్ డైరెక్టర్

Night Curfew: కరోనా పరిస్థితులపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Update: 2022-01-25 07:51 GMT

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ... క్లారిటీ ఇచ్చేసిన హెల్త్ డైరెక్టర్

Night Curfew: కరోనా పరిస్థితులపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు ఇప్పటికే హైకోర్టుకు నివేదిక సమర్పించారు. తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా వ్యాప్తి లేదని డీహెచ్‌ డాక్టర్‌ డి.శ్రీనివాసరావు అన్నారు. పాజిటివిటీ రేటు 10శాతం దాటితే కర్ఫ్యూ అవసరమని చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16శాతం ఉందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.16 లక్షల మందికి ప్రికాషనరీ డోసు ఇచ్చామని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జనం గుమికూడకుండా ఈ నెల 31 వరకు ఆంక్షలు విధించామన్నారు.

Tags:    

Similar News