Coronavirus: యాదాద్రిపై కరోనా పంజా.. ఆరోజు నుంచి పెరుగుతూ వస్తున్న కరోనా కేసుల సంఖ్య

Coronavirus: భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం కంటిన్యూ అవుతోంది. ప్రతిరోజూ లక్షల్లో నమోదవుతున్న కేసులు, మరణాలతో ప్రజలు గడప దాటాలంటేనే భయపడుతున్నారు.

Update: 2021-04-30 08:28 GMT

Coronavirus: యాదాద్రిపై కరోనా పంజా.. ఆరోజు నుంచి పెరుగుతూ వస్తున్న కరోనా కేసుల సంఖ్య

Coronavirus: భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం కంటిన్యూ అవుతోంది. ప్రతిరోజూ లక్షల్లో నమోదవుతున్న కేసులు, మరణాలతో ప్రజలు గడప దాటాలంటేనే భయపడుతున్నారు. తాజాగా ఈ హమ్మారి ప్రభావం ఆలయాలపైనా పడింది. తెలంగాణలోనే ప్రముఖ ఆలయం అయిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంపై కోవిడ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యాదాద్రి టెంపుల్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌పై హెచ్‌ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్.

తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పడింది. గతంలో నిత్యం భక్తులతో కళకళలాడే యాదాద్రిలో కరోనా సెకండ్‌వేవ్‌ దెబ్బతో కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో భక్తులు ఆలయాన్ని సందర్శించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

సెకండ్‌వేవ్ కల్లోలం ప్రారంభమైన నుంచీ ఆలయ అర్చకులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. కరోనా నిబంధనలతోనే ఆర్జిత సేవలు నిర్వహిస్తున్న ఆలయ అధికారులు భక్తులను పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేసి దర్శనానికి అనుమతిస్తున్నారు. అయినప్పటికీ కేసులు పెరగడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పడిపోయింది. ప్రతిరోజూ ఆర్జీత సేవల ద్వారా 3 నుంచి 4 లక్షల వచ్చే ఆదాయం ఇప్పుడు దారుణంగా పడిపోయింది. రోజు వారీ ఆదాయంతో పాటు ఈ ఏడాది స్వామివారి ఆదాయం 140 కోట్ల నుంచి 70 కోట్లకు పడిపోయినట్లు సమాచారం.

మరోవైపు కరోనా కట్టడిలో భాగంగా అమలవుతున్న నైట్ కర్ఫ్యూకు అనుగుణంగా ఆలయ వేళల్లో అధికారులు మార్పులు కూడా చేశారు. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉండడంతో ఆలయాన్ని ఉదయం 5 గంటల 30 నిమిషాలకు తెరిచి రాత్రి 8గంటలకు మూసివేస్తున్నారు. అటు ఆలయంలో నిత్య కైంకర్యాలు యధావిధిగా కొనసాగుతున్నాయన్న అర్చకులు భక్తుల రాకపై మాత్రం కోవిడ్ ఎఫెక్ట్ పడిందని తెలిపారు.

ఇక యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో కరోనా ఒక్కసారిగా పంజా విసిరింది. మార్చి 15న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 25న ముగిశాయి. స్వయంభూ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న బాలాలయంలోనే వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలలో దాదాపు 70 మంది పారాయణం నిర్వహకులు, రుత్వికులు, ఆచార్యులతో పాటు ఆలయ ఉద్యోగులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన 5రోజుల్లోనే 78మంది ఆలయ సిబ్బంది, భక్తులకు కరోనా సోకింది. ఆరోజు నుంచీ ఆలయంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

మరోవైపు కరోనా కల్లోలంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన ఆలయ అధికారులు కట్టడి చర్యల దిశగా అడుగులు వేశారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 3వరకూ ఆర్జిత సేవలను, నిత్యాన్నదాన ప్రసాదాలను నిలిపివేశారు. నిత్య పూజలను సైతం అంతరంగికంగానే జరిపారు. అనంతరం ఏప్రిల్ 4 నుంచి అన్ని ఆర్జిత సేవలను తిరిగి అందుబాటులోకి తెచ్చినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో భక్తుల రద్దీ తగ్గింది. దీంతో ఆలయానికి భక్తుల ద్వారా వివిధ రూపాల్లో వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది.

ఇక లాక్‌డౌన్‌కు ముందు వరకూ ప్రతినెలా 15 కోట్ల రూపాయలువచ్చే ఆదాయం గణనీయంగా పడిపోవడంతో ఆలయ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అటు బ్రహ్మోత్సవాల సమయంలో మహమ్మారి బారిన పడిన అర్చకులు, సిబ్బంది కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని విధుల్లో చేరుతున్నారు. దీంతో త్వరలోనే కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తొలగిపోయి సాధారణ పరిస్థితులు ఏర్పడాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.

Tags:    

Similar News