దిశ కేసులో పూర్తి వివరాలు సేకరించింది NHRC బృందం

దిశపై హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్‌పై NHRC బృందం విచారించింది. రెండో రోజు పర్యటనలో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను విచారించింది.

Update: 2019-12-08 15:03 GMT
Nhrc

దిశపై హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్‌పై NHRC బృందం విచారించింది. రెండో రోజు పర్యటనలో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను విచారించింది. హైదరాబాద్ లోని తెలంగాణ పోలీస్‌ అకాడమీలో నిందితుల కుటుంబ సభ్యులను విచారించారు. నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను NHRC రికార్డు చేసింది. అనంతరం మానవ హక్కుల బృందం దిశ కుటుంబ సభ్యులను గంటపాటు పోలీస్‌ అకాడమీలో విచారించింది. దిశ కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను NHRC రికార్డు చేసింది.

మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన డాక్టర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. ఒక్కో మృతదేహానికి ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి...? ఆ బుల్లెట్లు ఎవరివి...? అన్న కోణంలో విచారించినట్లు తెలిసింది. పోస్టుమార్టం రిపోర్ట్‌పై NHRC బృందం ఎటువంటి ప్రకటన వెల్లడించనందున రీ పోస్టుమార్టం చేస్తారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్‌కౌంటర్ ‌పై NHRC బృందం సమగ్ర నివేదిక తయారు చేయనుంది. నివేదికలో ఏ ఏ అంశాలుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్‌కౌంటర్‌పై పోలీసులు ఇచ్చిన వివరాలు ఏంటి...? NHRC ఏం చేయబోతుందనేది ఉత్కంఠగా ఉంది. ఎన్‌కౌంటర్‌పై అటు పోలీసులు, ఇటు నిందితుల కుటుంబ సభ్యులు, బాధిత కుటుంబం నుంచి పూర్తి వివరాలు సేకరించింది NHRC బృందం.

ఇటు మృతదేహాలను భద్ర పరచాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం రాత్రి 8 గంటలకు కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించాలని చెప్పింది. సోమవారం విచారణలో భాగంగా హైకోర్టు ఎటువంటి నిర్ణయం వెల్లడిస్తుందనేది ఆసక్తిగా మారింది. 

Tags:    

Similar News