Akhil Pahilwan Case: మరో ట్విస్ట్.. అఖిల్‌ పహిల్వాన్‌ ఎపిసోడ్‌లో కీలక విషయాలు

Akhil Pahilwan Case: 25 రోజులుగా ఫార్చూన్‌ హోటల్‌లో ఉంచి వ్యభిచార దందా

Update: 2024-01-28 14:00 GMT

Akhil Pahilwan Case: మరో ట్విస్ట్.. అఖిల్‌ పహిల్వాన్‌ ఎపిసోడ్‌లో కీలక విషయాలు

Akhil Pahilwan Case: హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డ అఖిల్‌ పహిల్వాన్‌ ఎపిసోడ్‌లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతని ఫోన్‌ చెక్‌ చేయగా అందులో పలు జాతీయ, అంతర్జాతీయ వ్యభిచార ముఠా నెంబర్లు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. ఆ ముఠాలతో రోజుకు 20 నుంచి 30 వరకు కాల్స్‌ మాట్లాడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఎలాంటి ప్రూఫ్స్‌ ఇవ్వకుండానే 16 మంది బెంగాల్‌ యువతులను 25 రోజులుగా ఫార్చూన్‌ హోటల్‌లో ఉంచి వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది.

హోటల్‌లో మొత్తం 25 రూమ్‌లు ఉండగా అందులో 16 రూమ్‌లను వ్యభిచారం కోసం వినియోగిస్తున్నారని గుర్తించారు. పలువురు ప్రముఖుల వద్దకు అఖిల్‌ పహిల్వాన్‌ అమ్మాయిలను పంపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిందితుడు అఖిల్‌ మాత్రం వ్యభిచారం నిర్వహిస్తునట్టుగా ఒప్పుకోలేదని, తన హోటల్ లో వ్యభిచారం జరుగుతున్న విషయం తనకు తెలియదనే సమాధానం చెప్పినట్టుగా సమాచారం. ఇక వ్యభిచారం నిర్వహిస్తున్న అఖిల్‌కు సంబంధించిన హోటల్‌ను సీజ్ కోసం RDOకి పోలీసులు లేఖ రాశారు. అలాగే అతని బ్యాంక్ అకౌంట్స్ వివరాలు కూడా కావాలంటూ లేఖ రాశారు.

Tags:    

Similar News