ప్రారంభానికి సిద్ధమైన సమీకృత కలెక్టరేట్ భవనాలు

* అత్యాధునిక వసతులు, హంగులతో కొత్త కలెక్టరేట్ కార్యాలయాలు * 25 ఎకరాల విస్తీర్ణంలో నిజామాబాద్ కలెక్టరేట్ భవనం నిర్మాణం * 2017 అక్టోబర్ 11న నూతన భవనానికి శంకుస్థాపన

Update: 2021-01-07 03:22 GMT

Representational Image

పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవనాలు ప్రారంభానికి సిద్దం అవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు కలెక్టరేట్ల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. సంక్రాంతి లోపు నూతన కలెక్టరేట్ లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్ శివారులో సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభానికి సిద్దం అయ్యింది. అత్యాధునిక వసతులు, ఆధునిక హంగులతో కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని అధికారులు సిద్దం చేశారు. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని 2017 అక్టోబర్ 11న అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శంకుస్ధాపన చేశారు.

భవన నిర్మాణానికి ప్రభుత్వం 62 కోట్లు మంజూరు చేసింది. ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా వివిధ కారణాలతో భవన నిర్మాణం తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు భవన నిర్మాణ పనులు పూర్తి కావడంతో సంక్రాంతి లోపు సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే గొడుగు కిందకు వచ్చేలా నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించడం ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

భవన సముదాయం పనులు ఇప్పటికే పూర్తికాగా అంతర్గత రోడ్లు, ఫర్నిచర్‌ పనులను కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.

సీఎం కేసీఆర్‌ వచ్చే వారం మొదట్లో జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలి విడతలో జిల్లాలోని కామారెడ్డి, నిజామాబాద్ కలెక్టరేట్ల ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలకు సమాచారం అందింది.

Full View


Tags:    

Similar News