Darbhanga Blast: దర్భంగా బ్లాస్ట్ కేసులో కొత్త కోణం
Darbhanga Blast: సికింద్రాబాద్ పార్శిల్ పాయింట్‌కు క్యాబ్‌లో వెళ్లిన మాలిక్ సోదరులు
కొత్త కోణంలో దర్భాంగా పేలుడు విచారణ (ఫైల్ ఇమేజ్)
Darbhanga Blast: దర్భంగా పేలుడు కేసులో విచారణను వేగవంతం చేసింది ఎన్‌ఐఏ. లష్కరే తోయిబాతో సంబంధాలున్న మాలిక్ బ్రదర్స్‌ను విచారిస్తోంది. తాజాగా.. దర్భంగా బ్లాస్ట్ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. సికింద్రాబాద్ పార్శిల్ పాయింట్‌కు క్యాబ్‌లో వెళ్లారు మాలిక్ సోదరులు. అయితే.. క్యాబ్‌లో వెళ్లేటప్పుడు ఏం మాట్లాడుకున్నారనేదానిపై అధికారులు దృష్టి సారించారు. క్యాబ్ డ్రైవర్ కూడా ఉగ్రవాదులకు సహకరించే వ్యక్తేనా..? ఇదే క్యాబ్‌ను గతంలోనూ ఉగ్ర కార్యకలాపాలకు వాడారా..? అనే కోణంలో కూపీ లాగుతున్నారు ఎన్ఐఏ అధికారులు.