NPCI Build Data Center in Hyderabad : రూ.500 కోట్లతో నేషనల్ పేమెంట్ డేటా సెంటర్
NPCI Build Data Center in Hyderabad: హైదరాబాద్ నగరంలో స్మార్ట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ముందుకు వచ్చింది.
NPCI Build Data సెంటర్ ఇన్ Hyderabad: హైదరాబాద్ నగరంలో స్మార్ట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 'నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ముందుకు వచ్చింది. వివాదాల పరిష్కారానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), పేమెంట్ యాప్స్, కార్డులు ఇతరత్రా నగదురహిత లావాదేవీలను నిర్వ హించడం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ఈ సంస్థను 2008లో ఏర్పాటు చేశాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఎన్‌పీసీఐ నిర్మించనున్న స్మార్ట్ డేటా సెంటర్‌కు రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు.
ఎన్‌పీసీఐ ఈ డేటా సెంటర్‌ను అంతర్జాతీయ స్థాయి డేటా సెక్యూరిటీ ప్రమాణాలతో డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్మి స్తోంది. ఇక ఈ డేటా సెంటర్ నిర్మాణ పనులను ఎల్‌అండ్‌టీ సంస్థకు అప్పగించారు. భూకంపం, తుపాన్ల వంటి ప్రకతి వైపరీత్యాలు సంభవించినా చెక్కు చెదరకుండా ఉండేలా అత్యంత పటిష్టంగా ఈ డేటా సెంటర్‌ను నిర్మించను న్నారు. భౌగోళికంగా, మానవవనరుల పరంగా, శాస్త్ర సాంకేతిక సదుపాయాల పరంగా నగరానికి ఉన్న అనుకూలతలు నగరాన్ని ఎంచు కోవడానికి దోహదపడ్డాయి. ఈ డేటా సెంటర్ నిర్మాణం పూర్తయితే దేశంలో అతిపెద్ద డిజిటల్/ ఆన్‌లైన్ చెల్లింపుల నిర్వహణ కేంద్రంగా హైదరాబాద్ ఆవిర్భ స్తుంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యక్యాదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు.