తెలంగాణలో ఘనంగా స్వతంత్ర వజ్రోత్సవాలు
Talasani Srinivas Yadav: ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగుర వేయాలి
తెలంగాణలో ఘనంగా స్వతంత్ర వజ్రోత్సవాలు
Talasani Srinivas Yadav: తెలంగాణలో స్వతంత్ర్య వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ పీవీ మార్గ్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, G.H.M.C కమిషనర్ లోకేష్ కుమార్ జాతీయ జెండాలు పంపిణీ చేశారు. 3కె రన్‌ను మంత్రి ప్రారంభించారు. ఎందరో త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంతో ముందుకెళ్తుందన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగుర వేయాలని కోరారు.