Congress: ఉత్తమ్ పొలిటికల్ బాంబ్.. నల్గొండలో కాంగ్రెస్ నిరుద్యోగ దీక్ష వాయిదా..
Congress: నల్గొండలో కాంగ్రెస్ నిరుద్యోగ దీక్ష వాయిదా పడింది.
Congress: ఉత్తమ్ పొలిటికల్ బాంబ్.. నల్గొండలో కాంగ్రెస్ నిరుద్యోగ దీక్ష వాయిదా..
Congress: నల్గొండలో కాంగ్రెస్ నిరుద్యోగ దీక్ష వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న నల్గొండలో నిరుద్యోగ దీక్ష జరగాల్సి ఉంది. అయితే నేతల మధ్య సమన్వయలోపం కారణంగానే నిరుద్యోగ దీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను నిండా ముంచాయంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్.. పోరాటాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే నిరుద్యోగ దీక్ష షెడ్యూల్ ను ప్రకటించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్. ఇదిలా ఉంటే అసలు నిరుద్యోగ దీక్షపై తనకు సమాచారమే లేదని ఉత్తమ్ పొలిటికల్ బాంబ్ పేల్చారు. సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతోనే నల్లగొండ నిరుద్యోగ దీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది.