మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం

మూసి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది.

Update: 2025-10-29 06:35 GMT

మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం

మూసి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ప్రాజెక్టు ఏడు క్రస్ట్ గేట్లను నాలుగు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు గాను 644.60 అడుగులకు చేరింది.

పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను 4.36 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2677.06 క్యూసెక్కులు వస్తుంది. ప్రాజెక్టు దిగువనున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేపల వేటకు గాని పశువులను మేపడానికి గాని నదిలోకి దిగకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News