Asifabad: పోలీసు స్టేషన్ నుంచి నిందితుడు పరార్
Asifabad: ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ నుంచి ఓ నిందితుడు పరార్ అయ్యాడు.
Asifabad: పోలీసు స్టేషన్ నుంచి నిందితుడు పరార్
Asifabad: ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ నుంచి ఓ నిందితుడు పరార్ అయ్యాడు. తిర్యాణి మండలం పిట్టగూడలో వృద్ధుడు మంత్రాలు చేస్తున్నాడనే నేపంతో అదే గ్రామానికి చెందిన సిడాం వినోద్ గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం రెబ్బెన సర్కిల్ కార్యాలయానికి తరలించారు. నిందితుడు వినోద్ బహిర్బూమికి వెళుతానని చెప్పడంతో కానిస్టేబుళ్లు బాత్‌రూంకు తీసుకెళ్లారు.
అక్కడికి చేరుకున్నాక వినోద్ వెంట వచ్చిన పోలీసులను తోసివేసి బేడీలతోనే పారిపోయాడు. నిందితుడు తిర్యాణి మండలంలో తిరుగుతున్నట్లు సమాచారం రాగా పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు తాజాగా నిందితుడి వలన ప్రాణహాని ఉందంటూ గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.