నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

ఈ నెల 14 వరకు నామినేషన్ల స్వీకరణ.. 15న నామినేషన్ల పరిశీలన..

Update: 2022-10-07 02:35 GMT

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

Munugode By Poll Nominations: మునుగోడు ఉప ఎన్నికకు కౌన్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే ఈ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కాగా, ఇవాళ నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ను రిలీజ్ చేయనుంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి 14 వరకు కొనసాగనున్నది. అందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చండూరు తాహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక, ఎన్నికల రిటర్నరింగ్‌ అధికారిగా జగన్నాథరావు వ్యవహరించనున్నారు. ఎన్నికల కోడ్‌ ఈ నెల 3నుంచే అమల్లోకి వచ్చింది.

ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తాహసీల్దార్‌ కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకు బారికెడ్లు ఏర్పాటు చేశారు. నామినేషన్‌ దాఖలు చేసే వ్యక్తితో కలిసి ఐదుగురికి మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తారు. వారి వాహనాల పార్కింగ్‌ కోసం స్థానిక ZPHSలో ఏర్పాటు చేశారు. నియోకవర్గంలో ఏర్పాటు చేసిన 6 చెక్‌పోస్టుల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించనున్నారు. ఇక ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Tags:    

Similar News