Breaking News: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
Breaking News: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల ...
Breaking News: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల ...
Munugode Bypoll: నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. ఈ నెల 14తో నామినేషన్ల గడువు ముగియనున్నది.
నవంబర్ 3న ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా 6న ఓట్లను లెక్కించనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమంది. దీంతో నవంబర్ 3న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక బరిలో బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వయి స్రవంతి బరిలో ఉన్నారు. అటు టీఆర్‌ఎస్ నుంచి ఇంత వరకు అభ్యర్థిని ప్రకటించలేదు.