టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు షాక్.. సొంత గ్రామంలోనే..!
Munugode By Election Results: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా మారింది.
టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు షాక్.. సొంత గ్రామంలోనే..!
Munugode By Election Results: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా మారింది. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం మారుతుంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ముందుగా చౌటుప్పల్ మండలం ఓట్లు లెక్కించారు. తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 1352 ఓట్ల ఆధిక్యం రాగా.. రెండో రౌండ్‌లో బీజేపీ 789 ఓట్ల మెజారిటీ సాధించింది. ఆ తర్వాత మూడు రౌండ్‌లోనూ బీజేపీ 416 ఓట్లతో ఆధిక్యత కనబర్చింది. ఇక నాలుగో రౌండ్‌లో 299 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్ మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది.
మొత్తంగా నాలుగు రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్ 714 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. టీఆర్‌ఎస్ 26,443, బీజేపీ 25,729, కాంగ్రెస్ 7,380 ఓట్లు సాధించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామం లింగవానిగూడెంలో బీజేపీకి ఆధిక్యం కావడంతో.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామంలోనే బీజేపీ ఆధిక్యం రావడంతో చర్చకు దారితీస్తోంది. తన సొంత ఊరిలోనే బీజేపీ ఆధిక్యంలో రావడంతో.. కూసుకుంట్లపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.