విదేశీ లగ్జరీ కార్ల వెనుక ముంబై మాఫియా.. హైదరాబాద్‌లో నయా దందా

* రాయబారులకు విదేశీ కార్ల పన్నులపై మినహాయింపు * పన్ను మినహాయింపును క్యాష్ చేసుకుంటున్న ముంబై మాఫియా

Update: 2021-07-21 08:52 GMT

విదేశీ కారు(ఫైల్ ఫోటో)

Hyderabad: హైదరాబాద్‌లో నయా దందా వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే లగ్జరీ కార్ల వెనుక చాలా పెద్ద తతంగమే నడుస్తోంది. నిజానికి విదేశీ కార్లు దిగుమతి చేసుకుంటే భారీగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో రాయబారులకు పన్ను నుంచి మినహాయింపు ఉండడాన్ని ముంబై మాఫియా క్యాష్ చేసుకుంటోంది. రాయబారులను ఆశరాగా తీసుకున్న ముంబై మాఫియా విచ్చల విడిగా లగ్జరీ కార్లను దిగుమతి చేస్తోంది. విదేశాల నుంచి వస్తున్న కార్లు ముంబై నుంచి మణిపూర్‌లోని ఓ మారుమూల షోరూంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రాయబారుల పేరుతో లగ్జరీ కార్ల కొనుగోళ్లలో చెల్లించాల్సిన పన్నును మాఫియా ఎగ్గొడుతోంది. ఏడాది కాలంలో 20కిపైగా కార్లు దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై మాఫియా నుంచి వస్తున్న ఎక్కువ కార్లు హైదరాబాద్‌లోని ప్రముఖులే కొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తుండడంతో డీఆర్ఐ అధికారులు రంగంలోకి దిగారు. భాగ్యనగరంలో కోటి రూపాయలు పైగా విలువైన విదేశీ లగ్జరీ కార్లు ఉన్న రాజకీయ నేతలు, సినిమా తారలు, వ్యాపారవేత్తల వివరాలు సేకరిస్తున్నారు. వీరికి ముంబై లగ్జరీ కార్ల మాఫియాకు లింకులేమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ డీఆర్ఐ అధికారులు విచారణ షురూ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News