Uttam Kumar Reddy: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది..
Uttam Kumar Reddy: బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ సమావేశంలో చర్చించామన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Uttam Kumar Reddy: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది..
Uttam Kumar Reddy: బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ సమావేశంలో చర్చించామన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం రద్దు చేయడం సరైన విధానం కాదన్నారు. కేసీఆర్ ఆహంకారానికి నిదర్శనమన్నారు. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో.. పార్లమెంట్ లో కాంగ్రెస్ ప్రస్తావిసుందన్నారు. రాష్ట్రంలో దళిత బంధు పథకం సక్రమంగా అమలు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతేకాకుండా కర్ణాటక తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ వదిలేసి నియోజక వర్గాలకు వెళ్ళండని ఆయన పిలుపునిచ్చారు. దీనితో పాటు నేను ఎక్కడ పోటీ చేయాలి అనేది సోనియా గాంధీ నిర్ణయిస్తారని ఆయన వెల్లడించారు.