reavnth reddy representational image
హైదరాబాద్ జలమండలి నీటి ట్యాంకుల ప్రారంభోత్సవం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ రేవంత్‌రెడ్డి ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12.30కి సమయం ఇచ్చి ఉదయం 11.30కి ప్రారంభం చేసి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని ఎంపీ రేవంత్‌రెడ్డి అడ్డుకున్నారు. ట్యాంకులకు కట్టిన ప్లెక్సీలను తొలగిస్తూ ఆందోళనకు దిగారు ఎంపీ రేవంత్‌రెడ్డి. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.