శ్రీనివాస్‎ను పరామర్శించిన ఎంపీ ధర్మపురి అరవింద్

బీజేపీ కార్యాలయం ముందు నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసి, చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పరామర్శించారు. శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం దురదృష్టకర సంఘటన అన్నారు.

Update: 2020-11-01 15:32 GMT

బీజేపీ కార్యాలయం ముందు నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసి, చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పరామర్శించారు. శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం దురదృష్టకర సంఘటన అన్నారు. శ్రీనివాస్ తో మాట్లాడుతుంటే దుఃఖం ఆగలేదన్న అరవింద్.. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే కాదు ఎంపీ కూడా అయిన బండి సంజయ్ లాంటి నాయకులకే పోలీసుల రక్షణ లేకుంటే మాలాంటి కార్యకర్తలకేం ఉంటుందని శ్రీనివాస్ ఆవేదన చెందాడని ఎంపీ అరవింద్ తెలిపారు.

శ్రీనివాస్ కోలుకునే వరకూ బిజెపి నుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు ఎవరూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని ఆయన కోరారు. అటు శ్రీనివాస్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్‌, లక్ష్మణ్‌ పరామర్శించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం బాధాకరమన్నారు. అంతేకాకుండా శ్రీనివాస్ కి మెరుగైన చికిత్స అందిస్తామని వెల్లడించారు.

బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శ్రీనివాస్ ఈ రోజు పెట్రోల్‌ పోసుకొని నిప్పటించుకున్నాడు. స్థానికులు వెంటనే అతనిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. శరీరం కాలుతున్నప్పటికి బీజేపీ జిందాబాద్, బండి సంజయ్ అంటే నాకు ప్రాణం అంటూ అరిచాడు. కాగా శ్రీనివాస్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలియగానే దుబ్బాకలో ప్రచారంలో ఉన్నబండి సంజయ్ అక్కడి నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చి శ్రీనివాస్‌కు పరామర్శించారు.

Tags:    

Similar News