Arvind Dharmapuri: రేవంత్ చుట్టూ ఉన్నవారే జైల్లో వేసే కుట్ర పన్నుతున్నారు
Arvind Dharmapuri: అమిత్ షా వీడియోలు మార్ఫ్ చేసి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు
Arvind Dharmapuri: సీఎం రేవంత్‌పై ఎంపీ అర్వింద్ హాట్ కామెంట్స్
Arvind Dharmapuri: సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డిని చుట్టూ ఉన్నోళ్లు జైల్లో వేసే కుట్ర పన్నుతున్నారని అన్నారు. మోడీ, అమిత్ షా మార్ఫింగ్ వీడియోలు చేస్తున్నది రేవంత్ చుట్టుపక్కన ఉన్న వాళ్లేనని... శత్రువులు చుట్టూనే ఉన్నారని రేవంత్ గుర్తుంచుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి సీఎం సీటుకు కాంగ్రెస్ నేతలే ఎసరు పెడుతున్నారని ఆరోపించారు. ఇక రేవంత్ వ్యాఖ్యలపైనా ఎంపీ అర్వింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి హుందాగా మాట్లాడాలని.. తాము మాట్లాడితే తట్టుకోలేరని హెచ్చరించారు.