MLC Votes counting: తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ
MLC Votes counting Begins: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయ్యింది. తెలంగాణలో 3 స్థానాలకు ఉదయం 8గంటలకు లెక్కింపు మొదలైంది. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను అధికారులు తెరిచారు. మొత్తంగా 3 దశల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇందులో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కౌంటింగ్ కోసం 25 టేబుల్లను ఏర్పాటు చేశారు.
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి కరీంనగర్ లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్లగొండలోని వేర్ హౌసింగ్ గోదాములో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చెల్లుబాటు అయిన ఓట్లలో 50శాతానికిపైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.
ఇక అటు ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకూ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానిది ఏలూరు సమీపంలోని వట్లూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో క్రిష్ణ, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కాలేజీలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.