Mahender Reddy: పొరపాటున నోరు జారా.. పోలీసులంటే నాకు ఎనలేని గౌరవం..
Mahender Reddy: తాండూరు సీఐను దూషించినందుకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
Mahender Reddy: పొరపాటున నోరు జారా.. పోలీసులంటే నాకు ఎనలేని గౌరవం..
Mahender Reddy: తాండూరు సీఐను దూషించినందుకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. పొరపాటున నోరు జారా.. మనస్సు నొప్పించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి. పోలీసులంటే తనకు ఎనలేని గౌరవం ఉందని.. తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పనితీరు భేష్ అని కొనియాడారు. ఆడియో క్లిప్పులతో పోలీసుల మనసు నొప్పిస్తే అది తనకు బాధకరంగా ఉంటుందని అన్నారు. తన వ్యాఖ్యల వల్ల పోలీసులు బాధపడితే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. కాసేపట్లో సీఐను కలవనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు.