Mlc Kavitha: కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాల వల్లే పార్టీకి నష్టం..ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Mlc Kavitha: కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాల వల్లే పార్టీకి నష్టం..ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Mlc Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు కేసీఆర్..ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకును్న కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టులో జాగ్రుతి కార్యకర్తలు , అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.
వరంగల్ సభ తర్వాత రెండు వారాల క్రితం నా తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాశాను. నా అభిప్రాయాలు లేఖ ద్వారా స్పష్టం చేశాను. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. దీనికి వెనక ఎవరున్నారో తెలియదు. నా కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుక పూర్తి చేసుకుని అమెరికా నుంచి వచ్చే లోపులేఖ బహిర్గతం అయ్యింది. దానిపై హంగామా నడుస్తున్నట్లు నాకు తెలిసింది. కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని మొన్నే చెప్పాను. నేను అంతర్గతంగా కేసీఆర్ కు రాసిన ఉత్తరం బహిర్గతం కావడంపై పార్టీలో ఉన్న అందరం ఆలోచించాల్సిన విషయం. పార్టీలో నాయకులు అనుకుంటున్న విషయలే నేను లేఖలో ప్రస్తావించాను. గతంలోనూ నా తండ్రికి అంతర్గతంగా చాలా లేఖలు రాశాను. కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖ లీక్ అయ్యింది. దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నా పరిస్థితే ఇలాఉందంటే మిగిలిన వారి పరిస్థితిఏంటి నా లేఖ లీన్ వెనక ఎవరో ఉండి ఉంటారు.
కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. వాటి వల్లే పార్టీకి నష్టం. మా నాయకుడు కేసీఆర్..ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది. కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. కోవర్టులనుపక్కకు తప్పిస్తేనే పార్టీ బాగుపడుతుంది. పార్టీలో చిన్న చిన్న లోపాలను చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నా తండ్రికి నేను రెగ్యులర్ గా లేఖలు రాస్తుంటాను. అందులోవ్యక్తిగతఎజెండా ఏమీ లేదు. నా లేఖలు చూసి బీజేపీ, కాంగ్రెస్ సంబర పడాల్సిన అవసరం లేదు అని కవిత అన్నారు. ఈలేఖ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారడంపై ఆమె స్పందించారు.