MLC Kavitha: బీఆర్‌ఎస్ అంటే ప్రజల ఇంటి పార్టీ.. రాహుల్ యాత్ర కూడా అలానే ఉంది..
MLC Kavitha: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ర్యాలీలో నిర్వహించింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ పాల్గొన్నారు.
MLC Kavitha: బీఆర్‌ఎస్ అంటే ప్రజల ఇంటి పార్టీ.. రాహుల్ యాత్ర కూడా అలానే ఉంది..
MLC Kavitha: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ర్యాలీలో నిర్వహించింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ పాల్గొన్నారు. బోధన్‌లో నిర్వహించిన ర్యాలీ..పాదయాత్రలా కాదు.. విజయోత్సవ ర్యాలీల ఉందని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కులం, మతాల పేరుతో చూడకుండా సమానంగా అభివృద్ధి చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ అంటే ప్రజల ఇంటి పార్టీ అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలంటే ఇతర పార్టీలకు ఈవీఎం లాగా కనపడతారని ఆమె విమర్శించారు. 35 లక్షల మంది రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు.
కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నుండి మంత్రిగా పనిచేసిన సుదర్శన్‌రెడ్డి ఒక్క చెరువును కూడా బాగుచేయలేదని ఆమె ప్రశ్నించారు. బోధన్‌లో సీనియారిటీకి, సిన్సియారిటీకి మధ్యే పోటీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చే హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆమె అన్నారు. 62 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని రాహుల్ పాదయాత్ర చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్ర చేసినట్లు ... రాహుల్ యాత్ర కూడా అలానే ఉందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.