Telangana News: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్..
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Telangana News: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్..
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై షాహినాయత్‌ల గంజ్‌లోని ఆయన ఇంట్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాసింగ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈక్రమంలో రాజాసింగ్ ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పార్టీ క్రమశిక్షణ సంఘం భావించి రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.