MLA Shakeel: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
MLA Shakeel: మునుగోడులో టీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తారు
MLA Shakeel: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
MLA Shakeel: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చెందితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని షకీల్ అమీర్ సంచలన కామెంట్స్ చేశారు. మునుగోడులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన ఘనమైన చరిత్ర బీజేపీకి ఉందని విమర్శించారు. మహారాష్ట్ర, గోవా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిన చరిత్ర బీజేపీకి ఉందన్నారు. బీజేపీ కుట్రలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా తిప్పికొట్టారంటున్నారు బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్.