అమర్‌నాథ్ లో ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో తప్పిన ప్రమాదం
Amarnath Yatra: అమర్ నాథ్ లో కుంభవృష్టి విషాదాన్ని నింపింది.
అమర్‌నాథ్ లో ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో తప్పిన ప్రమాదం
Amarnath Yatra: అమర్ నాథ్ లో కుంభవృష్టి విషాదాన్ని నింపింది. లోయలో రెండు కిలోమీటర్ల మేర వరద బీభత్సం సృష్టించింది. ఈ ఆకస్మిక వరదలతో 15 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు. భోలేనాథ్ గుహకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరో వైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. అమర్నాథ్ యాత్రలో ఉన్న ఆయన వరదల నుంచి తృటిలో తప్పించుకున్నారు. వరద ముంచెత్తిన సమయంలో రాజాసింగ్ సమీపంలోనే ఉన్నట్లు తెలిసింది.
వరద స్పాట్ నుంచి బయటకు వచ్చిన పది నిమిషాల్లోనే వరదలు వచ్చాయని రాజాసింగ్ తెలిపారు. అమర్‌నాథ్‌లో మంచు శివ లింగాన్ని దర్శించుకున్నట్లు రాజా సింగ్ తెలిపారు.. గత 3 రోజులుగా అమర్‌నాథ్ మార్గంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపిన ఆయన హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం కావాలని భావించామని కానీ, అననుకూల వాతావరణం నేపథ్యంలో గుర్రాలపై తిరుగు ప్రయాణం అయినట్టు వెల్లడించారు. ఇక, వరదలపై ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా వరద వచ్చింది, నా కళ్ల ముందే చాలా మంది కొట్టుకుపోయారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.