Jangaon: పల్లాపై ఆగ్రహం.. కంటతడి పెట్టిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి..
Muthireddy Yadagiri Reddy: పల్లా రాజేశ్వర్ రెడ్డి కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపించారు.
Jangaon: పల్లాపై ఆగ్రహం.. కంటతడి పెట్టిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి..
Muthireddy Yadagiri Reddy: పల్లా రాజేశ్వర్ రెడ్డి కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపించారు. ఇకనైనా రాజేశ్వర్ రెడ్డి తప్పుడు ప్రచారాలను మానుకోవాలని సూచించారు. తన కుతురును తనకు కాకుండా చేశారని.. ఈ సందర్భంగా మీడియా ముందు ముత్తిరెడ్డి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కుట్రలు జనగామలో సాగవని స్పష్టం చేశారు. పల్లా ఎంత ఎత్తుగా ఉంటాడో అంత ఎత్తులో కుట్రలు చేస్తారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను డబ్బులతో పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లిందన్నారు. ఓ కార్యకర్త కూడా ముత్తిరెడ్డికే.. సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించాలంటూ ఎమ్మెల్యేను పట్టుకుని ఎడ్చిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.