MLA Kova Laxmi: కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ విసిరిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే!

MLA Kova Laxmi: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జంకాపూర్‌లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.

Update: 2025-08-07 09:43 GMT

MLA Kova Laxmi: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జంకాపూర్‌లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్యామ్ నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో శ్యామ్ నాయక్ చేసిన వ్యాఖ్యలపై కోవ లక్ష్మి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అవమానించారని ఆరోపించిన ఆమె, ఆవేశంతో వాటర్ బాటిళ్లను శ్యామ్ నాయక్‌పై విసిరారు. ఈ ఘర్షణ అదనపు కలెక్టర్ డేవిడ్ సమక్షంలోనే చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ, “కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం వంటి పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ తన హామీలను నెరవేర్చలేదు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల్ని మర్చిపోయారు,” అని విమర్శించారు.

దీనిపై కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ కూడా ప్రత్యుత్తరం ఇస్తూ, “మునుపటి ప్రభుత్వం కూడా అనేక హామీలను నెరవేర్చలేదు. అభివృద్ధి ఏమిచేశారు?” అని ప్రశ్నించారు. ఈ మాటల యుద్ధం క్రమంగా ఉద్రిక్తతకు దారితీసి, సభా వాతావరణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి.

Tags:    

Similar News