MLA Jagga Reddy: రాహుల్ భారత్ జోడో యాత్రను విజయంవంతం చేయాలి
MLA Jagga Reddy: మెదక్ జిల్లాలోకి రాహుల్‌ను ఘనంగా స్వాగతించాలి
MLA Jagga Reddy: రాహుల్ భారత్ జోడో యాత్రను విజయంవంతం చేయాలి
MLA Jagga Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను సక్సెస్ చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్ర ఈనెల 3న సంగారెడ్డి నియోజకవర్గానికి చేరుకోనున్న నేపథ్యంలో యాత్రపై నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో జగ్గారెడ్డి సన్నాహాక సమావేశం నిర్వహించారు. రాహుల్ యాత్ర జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా నవంబర్ 3న 60వేల మందితో రాహుల్‌కు ఘన స్వాగతం పలకాలని పార్టీ క్యాడర్‌కు స్పష్టం చేశారు. స్వాగత ఏర్పాట్లతో పాటు, యాత్ర నిర్వహణ అంశంపై విస్త్రతంగా చర్చించారు. సంగారెడ్డి జిల్లాలో జరిగే 24 కిలోమీటర్ల రాహుల్ పాదయాత్రను భావితరాలకు గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేయాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.