Municipal elections 2020: ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్ అర్బన్: జిల్లా ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల నాందేవాడలో గల విట్టలేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించుకొని, నగర పాలక సంస్థల సాధారణ ఎన్నికల సందర్భంగా.. ఇందిరా ప్రియదర్శిని కాలనీలో గల ప్రభుత్వ ప్రైమరీ స్కూల్, 283 పోలింగ్ కేంద్రంలో, రూమ్ నెం.1 లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..నగరంలో ప్రశాంత వాతావరణంతో ఎన్నికలు జరగాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముందుగా యువత మంచి అభ్యర్థులను ఎన్నుకొని ఓటు వేయాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికలో ఓటింగ్ శాతం ఎక్కువ మొత్తంలో జరగలేదు. కావున యువత ప్రాధాన్యత తీసుకొని ఓటు హక్కును వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలి అని అన్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ లైవ్ అపుడట్లు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..