అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. నేను లోకల్.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు
Danam Nagender: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. నేను లోకల్.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు
Danam Nagender: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లు ఉందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అందుకే తనపై కేసులు పెడుతున్నాడంటూ విమర్శలు గుప్పించారు. అధికారులు వస్తుంటారు.. పోతుంటారని తాను ఇక్కడే ఉంటానని అన్నారు.
నందగిరి హిల్స్ హుడా లే ఔట్‌లో.. ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే తాను అక్కడకు వెళ్లానని చెప్పారు. జరిగిన విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లానని..ప్రజల సమస్యలు పరిష్కరించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అన్నారు. ఈ విషయంపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు.