MLA Bhupathi Reddy: కాంగ్రెస్ సర్కార్ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది
MLA Bhupathi Reddy: నిజామాబాద్ జిల్లా వెంగల్పాడులో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు.
MLA Bhupathi Reddy: నిజామాబాద్ జిల్లా వెంగల్పాడులో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. గతంలో జిల్లాలో మహిళలకు 100 కొనుగోలు కేంద్రాలు కేటాయించగా.. తమ ప్రభుత్వం 200కు పెంచిందన్నారు. మహిళలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భూపతి రెడ్డి కోరారు.