Siddipet: మిషన్ భగీరధ పైప్ లైన్ లీక్

Siddipet: గంట సేపు వృధాగా పోయిన నీరు

Update: 2023-02-16 08:45 GMT

Siddipet: మిషన్ భగీరధ పైప్ లైన్ లీక్

Siddipet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ముందు మిషన్ భగీరథ పైప్ లైన్ లీకై దాదాపు గంట సేపు నీరు వృధాగా పోయింది. పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ వాల్వు ను ఓ కారు ఢీకొనడంతో వాల్వు లీకై మిషన్ భగీరథ నీరు పైకి ఎగిసి పడినట్టు స్థానికులు తెలిపారు. సమయానికి సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో సుమారు గంట సేపు నీరు వృధాగా పోయింది. నీరు ఫౌంటెన్ లా ఎగసి పడుతుండడాన్ని స్థానికులు, అటువైపుగా వెళ్తున్న వారు ఆసక్తిగా తిలకిస్తూ, తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Tags:    

Similar News