Minister Talasani Srinivas: సనత్‌నగర్‌ బాలుడి హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తాం

Minister Talasani Srinivas: అబ్దుల్ వహిద్ కుటుంబానికి అండంగా ఉంటా

Update: 2023-04-21 08:25 GMT

Minister Talasani Srinivas: సనత్‌నగర్‌ బాలుడి హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తాం

Minister Talasani Srinivas: నగరంలోని సనత్‌నగర్‌లో ఎనిమిదేళ్ల బాలుడి మృతిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. బాలుడి మృతి బాధాకరమన్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి పోలీసులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణం అనే పోలిసుల ప్రాధమిక దర్యాప్తు వెలుగులోకి వచ్చిందన్నారు. ఏదైనా ఉంటే తల్లిదండ్రులుతో మాట్లాకోవాలి కాని పిల్లలను హత్య చేయడం ఏంటి అన్నారు. ప్రాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు ఉరి శిక్ష పడేలా ఆధారాలను సేకరించి కోర్టుకు ప్రవేశపెట్టాతామన్నారు.ఈ సంఘటన జరిగిన తర్వాత బస్తీలోని తల్లిదండ్రులు భయపడ్డుతున్నారని..వారి భయాన్ని పోగేట్టేందుకు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా అబ్దుల్ వహిద్ కుటుంబానికి అండంగా ఉంటామన్నారు. 

Tags:    

Similar News