Bonalu Festival 2021: ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర

Bonalu Festival 2021: తొలిబోనం సమర్పించిన మంత్రి తలసాని

Update: 2021-07-25 04:26 GMT

ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన మంత్రి తలసాని (ఫైల్ ఇమేజ్)

Bonalu Festival 2021: మహానగరం మహాజాతరను తలపిస్తోంది. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి ఆలయం కోలాహలంగా మారింది. సల్లంగా చూడమ్మా అంటూ మహిళలు బోనాలతో బారులు తీరుతున్నారు. ఉదయం నాలుగు గంటలకు యాదవుల తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. ఇక భక్తులు వేకువజాము నుంచే మహంకాళి తల్లికి బోనం మొక్కులు చెల్లిస్తున్నారు.

ఈ ఏడాది బోనాల జాతరకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. భక్తులు కోవిడ్‌ రూల్స్ పాటించేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. క్యూలైన్లలో ఉన్నవారికి మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. ఇక వేడుకలను తిలకించేందుకు ప్రధాన ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.

ఇటు పోలీసులు కూడా గట్టి బంబోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవంతరాలు జరగకుండా 2500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.ఆలయ చుట్టూ పక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రేపటి వరకు ఉంటాయని పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. 

Tags:    

Similar News