Satyavathi Rathod: పోడుభూములు, అడవుల సంరక్షణకు సహకరిస్తాం
* ఫారెస్ట్ ,రెవెన్యు అధికారులతో పాటు రాజకీయ పార్టీలతో సమీక్ష
సత్యవతి రాథోడ్(ఫైల్ ఫోటో)
Satyavathi Rathod: పోడు భూములు, అడవుల సంరక్షణ సమస్యలను రెండు నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా ఫారెస్ట్ ,రెవెన్యు అధికారులతో పాటు రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి. కొంతమంది అమాయక గిరిజనులను అడ్డు పెట్టుకొని గిరిజన భూముల్లో ఉన్నారు. ఇలాంటి వారి దగ్గర నుంచి భూమి వెనక్కి తీసుకుని పేదలకు పంచుతామని హెచ్చరించారు.