Malla Reddy: కుమారుడికి అస్వస్థత.. ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం
Malla Reddy: నా కొడుకు బాధ చూడలేక నేను ఆస్పత్రిని నుంచి బయటకు వచ్చా
Malla Reddy: కుమారుడికి అస్వస్థత.. ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం
Malla Reddy: మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. అనంతరం బీజేపీ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కష్టపడి సంపాదించి నిజాయితీగా మెలిగానన్నారు. ఎన్నో ఏళ్లపాటు కష్టపడితే ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. బీజేపీ అక్రమంగా దాడులు చేయిస్తోందని... దాడులకు బెదిరేది లేదన్నారు. తన కుమారుడు ఆస్పత్రిలో చేరాడని... ఐటీ అధికారులు దాడుల చేశారేమో అని అనుమానం కలుగుతోందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.